Home తాజా వార్తలు వనస్థలిపురంలో అగ్నిప్రమాదం…

వనస్థలిపురంలో అగ్నిప్రమాదం…

fire accident in vanasthalipuram

హైదరాబాద్‌ : వనస్థలిపురంలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆటోనగర్‌ లోని కనకదుర్గ లారీ పార్కింగ్‌ యార్డులో ఉన్న కరెంట్‌ వైర్లు తెగిపడ్డాయి. దీంతో రెండు లారీలు, ఒక కారు దగ్ధమయ్యాయి.  స్థానికుల సమచారంతో ఘటనస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పార్కింగ్‌ యార్డులో కరెంట్‌ స్తంభాలు సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు బాదితులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.