Home రాష్ట్ర వార్తలు యాగశాలలో స్వల్ప అగ్నిప్రమాదం

యాగశాలలో స్వల్ప అగ్నిప్రమాదం

5వెనుదిరిగిన రాష్ట్రపతి
సిద్దిపేట/ గజ్వేల్  : మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యవసాయ క్షేత్రంలో ఐదు రోజుల పాటు నేత్ర పర్వంగా సాగిన అయుత చండీ మహాయాగం ఆది వారం వైభవంగా ముగిసింది. చివరిరోజయిన గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటెల రాజేం దర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కెటిఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతి పూజతో పాటు గురుపూజోత్సవంతో కార్య క్రమం ప్రారంభమైంది. కెసిఆర్ యాగశాల చుట్టూ ప్రద క్షణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పుణ్యాహవచనం, కుండ సంస్కారం, ప్రధాన హోమ గుండాలలో అగ్ని ప్రతిష్ట నిర్వహించారు. యాగశాల వద్ద ఉన్న నూటొక్క హోమ గుండాల వద్ద 1100 మంది రుత్విక్కులు సమిధలు, పాయసం, ఆజ్యం, కర్పూరం, తదితర పూజాసామగ్రిని ప్రధాన గుండాల్లో అగ్ని ప్రతిష్ట తర్వాత అగ్నికి ఆవాహన చేశారు. అగ్ని విహరణం అనే ప్రక్రియ ద్వారా మిగిలిన వంద గుండాలలో ప్రతిష్ట చేశారు. మహా పూర్ణాహుతి చేయడానికి ముందు, చతు ర్వేద, మహారుద్ర, రాజశ్యామల యాగశాలల్లో పూర్ణా హుతి పూర్తి చేశారు. అగ్ని విహరణలో భాగంగా జరిగిన హోమంలో ప్రతి రుత్విక్కుడు సప్తశతి మంత్రాలతో ఏడు వందల ఆహుతులను పరమాన్న ద్రవ్యంగా సమర్పిం చారు. వేయి ఆహుతులను ఆజ్య ద్రవ్యంగా ఇచ్చారు. మొత్తం ఏడు లక్షల పరమాన్న ద్రవ్యం, పది లక్షల ఆజ్య ద్రవ్యం ఆహుతి చేశారు. అంతకు ముందు జరిగిన తర్పణంలో వందమంది రుత్విక్కులు పూర్వాంగ, ఉత్త రాంగ సహితంగా ఏడు వందల మంత్రాలతో తర్పనం ఇచ్చారు. ఏడు లక్షల నవాక్షరీ మంత్రం జపించారు. అభిషేక జలాలతో యాగకర్త కెసిఆర్ దంపతులకు అవబృతం చేయించారు. మధ్యాహ్నం మహా రుద్ర యాగంకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.
యాగశాలలో అగ్నిప్రమాదం : కాగా, ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు తీర్థప్రసాదం తీసుకుంటున్న సమ యంలో యాగం నుంచి వెలువడిన నిప్పు రవ్వల మూలంగా అతిరుద్ర మహాయాగంలోని ఆగ్నేయ ప్రాం తంలో పైకప్పులో మంటలు చెలరేగాయి. కెసిఆర్ దంప తులు, రుత్విక్కులు తదితరులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక యంత్రాలు వచ్చేసరికి పైకప్పు పూర్తిగా కాలిపోయింది. ఆదివారం నూటొక్క యాగ గుండాలలో హోమం నిర్వహించడంతో ఆప్రాంతం వేడెక్కిపోయింది. విఐపిలను బయటకు తీసుకెళ్లడానికి మీడియా పాయింట్ పక్కన గల రేకుల అడ్డుగోడను కూల్చివేసి బయటకు పంపించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాగస్థలికి చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దాంతో మూడు హెలికాప్టర్లు గాలిలోనే చక్కర్లు కొట్టి వెనక్కి వెళ్లి పోయాయి. రాష్ట్రపతి తిరుగు ప్రయాణం పట్టడంతో నిర్వాహకులు ఎంతో నిరుత్సాహానికి లోనయ్యారు.
చంద్రబాబుకు సాదరంగా ఆహ్వానం
ఎపి సిఎం చంద్రబాబుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనం గా స్వాగతం పలికారు. చండీహోమం వద్ద చంద్రబాబుతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. చంద్రబాబు కెసిఆర్‌కు దుర్గా మాత చిత్రపటాన్ని బహుకరించ గా, కెసిఆర్ బాబుకు పూలదండ వేసి, శాలువా కప్పి దుర్గామత విగ్రహాన్ని అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటిం చారు. యాగం పరిసమాప్తి కావడంతోనే అమ్మ వారు యాగశాలను దహనం చేసి తన లో ఐక్యం చేసుకుందని, ఇది యాగ విజయానికి సంకేతమని విశాఖ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీస్వరూపానంద సరస్వతి స్వామి తెలిపారు.
యాగం విజయవంతం : నాగఫణిశర్మ
లోక కల్యాణార్థం కెసిఆర్ తలపెట్టిన అయుత చండీ యాగం అశేష భక్తజన సందర్శనతో విజయవంతంగా ముగిసిందని మాడుగుల నాగఫణి శర్మ తెలిపారు. అభి జిత్ లగ్నంలో శాస్త్రోత్తంగా నాలుగవ లగ్నంలో కార్య క్రమం విజయవంతంగా పూర్తయిందన్నారు. అప్పటికే కెసిఆర్ పూర్ణాహుతి నిర్వహించి యాగ భస్మాన్ని నుదిటి న ధరించారని, దాంతో కార్యక్రమం పూర్తయినట్లేనని ఆయన తెలిపారు.
సహకరించిన వారికి హరీశ్‌రావు ధన్యవాదాలు
ప్రపంచ శాంతిని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ తలపెట్టిన అయుత చండీ యాగం విజయవంతం కావ డానికి సహకరించిన వారందరికీ సాగునీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న పోలీసు, ఫైర్, రెవెన్యూ శాఖలకు చెందిన సిబ్బందితో పాటు టిఆర్‌ఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేయడంలో సహకరించారని హరీశ్‌రావు అన్నారు. అనేక మంది యాగానికి స్వచ్ఛందంగా సహకరించారని సంతోషం వ్యక్తపరిచారు.
గిరీష్ సంఘీ విరాళం: చండీయాగ నిర్వహణ కోసం ‘వార్త’ దినపత్రిక సిఎండి గిరీష్ సంఘీ, జెఎంజె గ్రూపు చైర్మన్ జె.ఎం. జోషి ఉభయులు కలసి రూ. 25 లక్షల విరాళాన్ని సిఎం కెసిఆర్‌కు అందజేశారు.