Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

టెక్సాస్‌లో కాల్పులు

int

టెక్సాస్ స్కూల్లో కాల్పులు:  10 మంది విద్యార్థులు మృతి
పాఠశాలలోనే దారుణం, దుండగుడి అరెస్టు

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో ఒక హైస్కూల్‌లో శుక్ర వారం నరమేథం జరిగింది. ఒక విద్యార్థి జరిపిన కాల్పుల్లో కనీసం పది మంది మృతి చెందారు. వీరిలో అత్యధికులు విద్యార్థులే కావడంతో అంతటా విషాదం నెలకొంది. ఘటన తరువాత సాయుధ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని సాంటా ఫీ హైస్కూల్‌లో ఈ దుర్ఘటన జరిగింది. హుస్టన్‌కు 50కిలోమీటర్ల వాయవ్యంలో ఉన్న ఈ నగరంలో సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులుకు దిగినట్లు, ఈ ఘటనను నివారించేందుకు ఒక ప్రైవేటు సెక్యూరిటీ గార్డు యత్నించాడని వెల్లడైంది. ఈ క్రమంలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. స్కూల్‌కు చెందిన విద్యార్థి సాయుధుడిగా మారి కాల్పులకు దిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. స్కూల్‌లో అన్ని గదులలో సోదాలు చేపట్టారు. అక్కడ పేలుడు పదార్థాలు ఉన్నట్లు నిర్థారణ కాలేదు. కాల్పుల్లో పలువురు విద్యార్థులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గత ఏడు రోజులలో స్కూళ్లలో కాల్పులు జరగడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఆరంభం నుంచి విద్యాల యాలలో కాల్పులతో కల్లోలం సృష్టించడం ఇది 22వ సారి. స్కూళ్లలో కూడా సాయుధ అరాచక సంస్కృతి నెలకొనడం, హింసాత్మక ప్రవృత్తికి పాల్పడటంపట్ల అమెరికాలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Comments

comments