Home జాతీయ వార్తలు ఢిల్లీలో కాల్పులు : ఇద్దరి మృతి

ఢిల్లీలో కాల్పులు : ఇద్దరి మృతి

GUNఢిల్లీ : ఢిల్లీలోని బదర్‌పూర్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. బైక్‌పై వచ్చిన దుండగులు టోల్ ప్లాజా సిబ్బందిపై కాల్పులు జరిపి నగదుతో పరారీ అయ్యారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు, క్యాషియన్‌లు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.