Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

పారిస్ కాల్పుల కలకలం

GUNFIRE1పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. బాస్టిల్లి ప్రాంతంలోని చెజ్ పాపా రెస్టారెంట్ ఎదుట ఓ వ్యక్తిపై కొందరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. వీరిలో ఒకరిని పోలీసులు పట్టుకోగా, మరో ఇద్దరు తప్పించుకున్నారు. అయితే ఇది ఉగ్రవాద చర్య కాదని, ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అతడికి ప్రాణాపాయమేమీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. పారిస్ నగరంలో ఇటీవల ఐసిస్ ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన విషయం తెలిసిందే. నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లు , థియోటర్లపై దాడులు జరిపి సుమారు 130 మందిని బలి తీసుకున్నారు. అప్పటి నుంచి పారిస్ అంతటా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Comments

comments