Home తాజా వార్తలు అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

fire

హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వరంగల్ చెందిన శరత్ కొప్పు(24)కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మిస్సోరిలోని కేన్సస్‌ సిటీ రెస్టారెంట్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.  శరత్ మిస్సోరిలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు. స్నేహితుల ద్వారా శరత్ తల్లిదండ్రులకు సమాచారం అందడంతో కుమారుడి సమాచారంపై శరత్ తల్లిదండ్రులు డిజిపిని కలిశారు. ఇదే విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు శరత్ తల్లిదండ్రులు తెలిపారు.తమ కుమారుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.