Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

నిప్పంటించుకున్న బిసి నేత

BC-fire_manatelangana copyసంగారెడ్డిలో కలెక్టరేట్‌కు సమీపంలో గల ఒక ప్రైవేటు పాఠశాల వద్ద అధిక ఫీజులకు నిరసనగా ధర్నా నిర్వహించిన బిసి సంఘం యువ నేత ఒకరు శనివారం నాడు నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడారు.

మన తెలంగాణ / సంగారెడ్డి: అధిక ఫీజులపై ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిర్లక్షం వైఖరిని నిరసిస్తూ బిసి సంఘం నేత ఒకరు శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. జిల్లా కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే శని వారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని ఒక ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ బిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. అరగంట పాటు ఆందోళన చేసినప్పటికీ పాఠశాల ప్రిన్సిపాల్ బయటికి రాకపో వడంతో సిరిబాబు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకు న్నారు. దీంతో ఆయన వెంట వచ్చిన వారితో పాటు అక్కడ గుమిగూడిన వారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. వారి లో కొందరు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మంట లకు తట్టుకోలేక సిరిబాబు అక్కడే ఉన్న నీటి మడుగులో పడి పొర్లాడాడు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసు లు అక్కడికి వచ్చి సిరిబాబును సమీపంలోని ఆస్పత్రికి తరలిం చారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు బురదలో పొర్లడంతో ఇన్‌ఫెక్షన్ అయిందని హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కుటుం బ సభ్యులు అతన్ని హైదరాబాద్‌కు తరలించారు. రూరల్ పోలీస్‌లు ఘటన పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు.

Comments

comments