Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కాల్పుల

policeబోయిన్‌పల్లిలో కాల్పుల కలకలం
హైదరాబాద్ బోయిన్‌పల్లిలో కలకలం
కాంగ్రెస్ నాయకుడిపై తుపాకీతో దాడి
భూ వివాదాలే కారణం?
బోయిన్‌పల్లి: రాష్ట్ర రాజధానిలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శ నివారం బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కాం గ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరిపై మలి కార్జున కాలనీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ ముందు గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులకు పా ల్పడ్డాడు. ఉదయం సుమారు 11.00 ప్రాంతం లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఏం జరుగుతుం దో తెలియని బాధితుడు పక్కనే ఉన్న శ్రీనివాస మెటర్నిటీ హోమ్‌లోకి పరుగులు తీశాడు. ఉద యం వేళ కావడంలో ఆసుపత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉండడం, బాధితుడు రక్తంతో పరుగు లు తీయడంతో మొదట అంతా రోగి గా భావిం చారు. వెంటనే తుపాకీతో దుండగుడు ఆసుపత్రి లోకి ప్రవేశిం చగానే అక్కడ చికిత్సకు వచ్చిన వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యా రు. ఆస్పత్రిలోనూ కాల్పులకు పాల్పడడంతో యాదగిరి ఆసుపత్రి వెనుక గేటు నుంచి బయట కు పరుగులు తీశాడు. అయినా దుండ గులు వెంబడించడంతో అతని బారి నుంచి తప్పించుకొ ని తిరిగి ఆసు పత్రిలోకి వచ్చి తలదాచుకున్నాడు. దుండగులు వెళ్లిపోయారన్న సమాచారంతో ఇత రులు సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశా డు. సిపి మహేందర్‌రెడ్డి, డిసిపి సుమతి, బోయి న్‌పల్లి సిఐ కిరణ్, ఎస్సైలు శ్రీనివా స్ సతీష్‌రెడ్డి తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితుడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసు కొని చికిత్స కోసం సికింద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో తుపాకీతో పాటు మూడు బులెట్లు లభించాయని, హత్యకు భూ వివాదాలే కారణ మని తెలుస్తుం దని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితు లను వెంటనే అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భూ వివాదాలే కారణామా?
ఓల్డ్‌బోయిన్‌పల్లి మల్లికార్జునకాలనీలో నివాస ముంటున్న కాంగ్రెస్ నాయ కుడు దండుగుల యాదగిరి డివిజన్ పరిధిలోని పలు భూ వివాదా ల్లో తలదూర్చడమే హత్యకు దారి తీయవచ్చని పలువురు చర్చించుకుంటు న్నారు. బాధితుడు గతంలో కొందరికి హామీలు ఇచ్చినట్లు సమా చారం.

Comments

comments