Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

టివి ఛానెల్‌లో సాయుధుల బీభత్సం

kabul

* సిబ్బంది..ఇద్దరి కాల్చివేత
* టెన్షన్.. టెన్షన్

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో గుర్తుతెలియని సాయుధులు మంగళవారం ఓ టీవీ ఛానెల్‌లోకి చొరబడి కాల్పులతో బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రముఖ టివి ఛానెల్ షంషాద్ ప్రధాన కార్యాలయంపై సాయుధులు దాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటికే ఇరువురు మృతి  చెందినట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయాలపాలైనట్లు సమాచారం. భద్రతా బలగాలు టివి చానెల్‌ను చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఛానెల్‌లో కాల్పులతో విరుచుకుపడుతున్న సాయుధులను ఏరివేయడమే లక్ష్యంగా భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఒక సాయుధుడిని భద్రతా దళాలు మట్టుబెట్టాయని కాబూల్ పోలీసులు ప్రకటించారు. మిగతా సాయుధులను కూడా ఏరివేసి, ఛానెల్ కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకుని సిబ్బందిని సురక్షితంగా బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నామని భద్రతా బలగాలు తెలిపాయి. భారీ ఆయుధాలతో వచ్చిన సాయుధులు గ్రనేడ్‌లు విసురుతూ విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ ఛానెల్ కార్యాలయంలోకి చొరబడ్డారు. ఈ సమయంలో కార్యాలయంలోని చాలామంది సిబ్బంది, ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. కార్యాయలంలో చొరబడిన సాయుధులు కాల్పులు కొనసాగిస్తుండటంతో అందులోని ఉద్యోగులు భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని గడుపుతున్నారు. సాయుధుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్టు ఛానెల్ రిపోర్టర్ ఒకరు మీడియాకు తెలిపాడు. చానెల్ కార్యాలయంలో భయానక వాతావరణం నెలకొందని, కాసేపటికోసారి కాల్పుల శబ్దం, ఉద్యోగాల హాహాకారాలు వినిపిస్తున్నాయని ఆయన వివరించారు. వందమందికిపైగా ఉద్యోగులు కార్యాలయ భవనంలో ఉన్నారు.

Comments

comments