Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇండిగో విమానంలో మంటలు

indigo
న్యూఢిల్లీ: ఆకాశవీధిలో ప్రయాణిస్తున్న విమానంలో పర్సనల్ ఎలక్ట్రిక్ డివైజ్ పేలిన ఘటన మరోసారి చోటుచేసుకుంది. నవంబర్ 11న తిరువపంతపురం నుండి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ల్యాప్‌టాప్ నుంచి మంటలు చెలరేగాయి. 6ఈ-445(విటి-ఐజివి) విమానంలో బ్లాక్ బ్యాగ్ నుంచి కాలుతున్న వాసన వచ్చినట్లు ప్యాసెంజర్లు రిపోర్టు చేశారు. వెంటనే అలర్ట్ అయిన విమానాశ్రయ సిబ్బంది స్ప్రేతో మంటలను అదుపు చేశారు.అంతేకాక ప్రయాణికుల సీట్లను వేరే ప్రాంతాలకు మార్చారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు ల్యాప్‌టాప్‌ను వాటర్ కంటైనర్‌లో ఉంచారు. ఈ విషయాన్ని ఇండిగో అధికార ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. గత నెలలో కూడా ఢిల్లీ నుండి ఇండోర్ వెళ్తున్న ఓ విమానంలో మొబైల్ ఫోన్ పేలి విమానంలో మంటలు వచ్చాయి.

Comments

comments