Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

టపాకాయలు కాల్చేటప్పుడు..

పిల్లలను టపాకాయలకు దూరంగా ఉంచండి. వాటిని వాడనివ్వడం లేదా వెలిగించనివ్వకండి. పర్యవేక్షించకపోతే కాకర పువ్వొత్తులు కూడా ప్రమాదకరం కావొచ్చు. ఐదేళ్లలోపు పిల్లలకు కాకర పువ్వొత్తులు ఇవ్వకండి. ప్రమాదాల గురించి పిల్లలకు తెలియజెప్పండి.  

చేయాల్సినవి
Diwali2బాణాసంచాను కేవలం ఆరుబయట ఉపయోగించండి.
బాణాసంచాను కేవలం అధికారిక/పేరున్న ఉత్పత్తిదారుల నుంచి మాత్రమే కొనుగోలు చెయ్యండి.
ఒక సమయంలో ఒక వ్యక్తి కేవలం ఒక్క బాణాసంచాను కాల్చాలి. మిగిలినవారు సురక్షిత దూరం నుంచి చూడాలి.
కాల్చవలసిన బాణాసంచాను సురక్షిత ప్రదేశంలో ఉంచండి.
వ్యక్తిగతంగా టపాకాయలను కాల్చేకన్నా ఒక సాముదాయిక బాణాసంచా ప్రదర్శనను ఏర్పాటు చేయండి.
టపాకాయలు కాల్చడానికి తప్పనిసరిగా ఒక పొడవాటి కొవ్వొత్తిని ఉపయోగించండి. శరీరానికి, టపాకాయలకు దూరాన్ని పెంచడానికి మోచేతిని ముందుకు చాపండి.
రెండు బక్కెట్ల నీటిని అందుబాటులో ఉంచుకోండి. అగ్ని ప్రమాదం జరిగితే, బక్కెట్లలోని నీటిని పోసి మంటలనార్పండి. ప్రతి పెద్ద అగ్నిప్రమాదం మొదలైనప్పుడు చిన్నగానే ఉంటుంది.
కాలినట్లయితే, కాలినచోట ఎక్కువగా నీరు పొయ్యండి.
ఎక్కువగా కాలినట్లయితే, మంటను ఆర్పిన తరువాత, రాజుకున్న బట్టలనన్నీ తొలగించండి. కాలిన వ్యక్తిని శుభ్రమైన దుప్పటిలో చుట్టండి.
అందరి ప్రయోజనానాలకోసం మీరందరూ పాకెట్ మనీ జమచేసి ఒక నిపుణునిచే బాణాసంచా ప్రదర్శనను ఏర్పాటు చేయండి.
కంటి సంబంధిత గాయమైతే, గాభరా పడకండి. కంటి లేదా ముఖంపై కాలిన గాయాలను శుభ్రమైన నీటితో 10 నిముషాలపాటు కడగవచ్చు. కాలిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్ళండి. కంటిలోపల గాయమైతే కంటిని సురక్షితంగా కప్పి, కంటి డాక్టర్ దగ్గరకు వెంటనే తీసుకువెళ్ళండి.
చేయకూడనివి
గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎగిరే బాణాసంచాను వెలిగించకండి.
కేవలం ప్రదర్శనకోసం బాణాసంచా వెలిగించేటప్పుడు అనవసరపు సాహసాలను చేయకండి.
బాణాసంచా చేతిలో పట్టుకుని కాల్చకండి.
కాలుస్తున్న టపాకాయలమీద వంగకండి.
పాత్రలలో పెట్టి టపాకాయలు కాల్చకండి.
కాలని టపాకాయల దగ్గరకు వెంటనే వెళ్ళకండి.
కాలని టపాకాయలను సరిచేయడానికి ప్రయత్నించకండి.
ఇంట్లో టపాకాయలు తయారుచేయడానికి ప్రయత్నించకండి.
చిన్నపిల్లలను టపాకాయలను వాడనివ్వకండి.
టపాకాయలను ఇతరులపై విసరకండి లేదా వారివైపు గురి చేయకండి.
టపాకాయలను జేబులో పెట్టుకోకండి.
వెలుగుతున్న కొవ్వొత్తులు, దీపాలకు దగ్గరగా బాణాసంచాను భద్రపరచకండి.
సన్న సందులలో టపాకాయలు కాల్చకండి; సాధ్యమైనంతవరకు ఆరుబయట, పార్కులను ఉపయోగించండి.
నైలాను దుస్తులను ధరించకండి; సాధ్యమైనంతవరకు మందమైన నూలు దుస్తులను ధరించండి.
వదులుగా వేలాడే దుస్తులను ధరించకండి; దుస్తులన్నింటినీ సరిగ్గా సురక్షితం చెయ్యండి.
కాలినచోట ఏ క్రీం లేదా ఆయింట్మెంట్ లేదా నూనెను రాయకండి.
కాలిన వ్యక్తిని తీసుకువెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంగా వాహనం నడపకండి; ఒక గంట ఆలస్యం అంట ముఖ్యం కాదు.
టపాకాయలవలన జరిగే ప్రమాదాలన్నీ నిర్లక్ష్యం, ఉపేక్ష, అజ్ఞానం వలన జరుగుతాయి. సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని నివారించవచ్చు.
అత్యవసర సమయంలో ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఏమర్జెన్సీ సహాయక నెంబర్లు 040 30612100, 9347573377 ను సంప్రదించండి.
మీ అందరికీ ఆనందదాయక, సురక్షిత దీపావళి శుభాకాంక్షలు !

డాక్టర్ మురళీధర్ రామప్ప,
కన్సల్టెంట్, పీడియాట్రిక్ కార్నియా & యాంటీరియర్ సెగ్మెంట్ సర్వీసెస్,
ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, హైదరాబాద్

Comments

comments