Home జాతీయ వార్తలు ప్రధాని గృహం వద్ద కాల్పులు

ప్రధాని గృహం వద్ద కాల్పులు

Pm-Houseఢిల్లీ : భారత ప్రధాని నివాస గృహం వద్ద కాల్పులు కలకలం రేపాయి. ప్రధాని మంత్రి నివాస గృహమైన 7వ రేస్ కోర్సులో రోడ్డులో సెక్యూరిటి అధికారి గన్ ప్రమాదవశాత్తు పేలింది. వివరాల్లోకి వెళ్తే ప్రధాని రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం టీం ప్రధాని నివాస గృహం వద్ద పాట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒక కానిస్టేబుల్ తన సర్వీస్ గన్‌ని వ్యాన్‌లో పెట్టబోతుండగా అది పొరపాటున పేలిందని సీనియర్ సెక్యూరిటీ అధికారి వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని నిర్ధారించారు. వెంటనే ప్రధాని నివాస గృహం ప్రాంతాన్ని సిఆర్‌పిఎఫ్ అధికారులు తన రక్షణలోకి తీసుకున్నట్లు సమాచారం. కానిస్టేబుల్‌ని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు.