Search
Sunday 18 November 2018
  • :
  • :

ఎయిర్‌పోర్టులో కాల్పులు

GUNFIRE1

పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఓర్లీ ఎయిర్‌పోర్టులో కాల్పులు జరిగాయి. ఎయిర్‌పోర్టు అధికారి నుంచి ఓ దుండగుడు ఆయుధాన్ని లాక్కునేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటన అనంతరం అధికారులు ఎయిర్‌పోర్టును ఖాళీ చేయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే గాయపడిన నిందితుడు కొద్దిసేపటికే చనిపోయాడు. భద్రతా దళాలు పేలుడు పదార్ధాల కోసం తనిఖీలు చేపట్టాయి. పూర్తి వివరాలు తెలియరాలేదు.

Comments

comments