Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో కాల్పులు : ఐదుగురు మృతి

అమెరికాలో కాల్పులు : ఐదుగురు మృతి

GUNFIRE1

చికాగో : అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. చికాగో సమీపంలో జరిగిన వేర్వేరు కాల్పుల్లో ఓ గర్భిణి సహా ఐదుగురు చనిపోయారు. చికాగోలోని సౌత్‌షోర్ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ సమీపంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో ఇద్దరిని సోదరులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ముందు రెస్టారెంట్‌కు సమీపంలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లి చూడగా ఓ గర్భిణి తలలో బులెట్ గాయంతో రక్తపు మడుగులో కనిపించింది. దుండగులు ఆమెపై కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.