Search
Wednesday 26 September 2018
  • :
  • :

పెళ్లిలో కాల్పులు : వరుడికి గాయాలు

Gun-Fire-Airహిసార్: సంబరాలు జరిగే సమయంలో అత్యుత్సాహంతో కొందరు తుపాకులను గాల్లోకి పేల్చే సంస్కృతి ఈ మధ్యన సర్వ సాధారణమైపోయింది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా గాల్లోకి తుపాకులు పేలుస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఒక్కోసారి విషాద ఛాయలు అలుముకునే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా హర్యాణలో జరిగిన వివాహ సంబరాల కాల్పుల్లో ఏకంగా వరుడే గాయపడ్డాడు.
హర్యాణలోని హిసార్ ప్రాంతంలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లి కొడుకుని మండపానికి తీసుకొస్తూ సంబరాలు చేశారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తి తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. దురదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ వచ్చి పెళ్లి కొడుక్కే తగిలింది. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వరుడు తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Comments

comments