Home తాజా వార్తలు బాహ్య చంద్రుల్లో గ్రహాంతర నివాసం

బాహ్య చంద్రుల్లో గ్రహాంతర నివాసం

moonలండన్: సౌరవ్యవస్థకు అవతల చంద్రగ్రహాల కక్షల్లో పరిభ్రమించే గ్రహాలు నివాసానికి కావలసిన ద్రవ రూప జలంతో ఉంటాయని అధ్యయనంలో తేలింది. సౌరవ్యవస్థకు అవతల ఉండే గ్రహాల్లో దాదాపు 4000 వరకు ఉన్నట్టు ఇప్పటివరకు బయటపడిందని బ్రిటన్ లోని లింకోల్న్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. వీటిలో స్వల్పభాగమే జీవనం గడపడానికి వీలుగా ఉంటుంది. దాన్నే నివాసయోగ్యమైన జోన్‌గా పరిగణిస్తారు. ఏదెలాగున్నా కొన్ని గ్రహాలు ముఖ్యంగా భారీ వాయువుల గ్రహాలు కూడా ద్రవ రూప జలంతో ఉండి ఆశ్రయం కల్పిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ చంద్రగ్రహాలు కక్ష లోని గురుత్వాకర్షణ శక్తి వల్ల అంతర్గతంగా వేడెక్కినా చివరకు బాహ్య ఉపరితలంపై ద్రవ రూప జలాన్ని సంతరించుకుంటాయి. సాధారణ జీవనానికి అనుకూలంగా ఉంటాయి. ఇటువంటి భూమి వంటి గ్రహాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని లింకోల్న్ యూనివర్శిటీ పరిశోధకులు ఫిల్ జె సట్టన్ వెల్లడించారు. వాటిని తాము కనుగొనగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఫలితంగా ఆయా చంద్రుల్లో గ్రహాంతర వాసానికి అనుకూలత ఎంతవరకో పరిశీలించడానికి వీలవుతుందని అన్నారు. భూమికి చాలా దూరంగా ఉండడం, అనూహ్య పరిమాణం తదితర కారణాల వల్ల బాహ్యచంద్రులను పరిశోధించడం కష్టతరమవుతోంది. అయితే వాటి చుట్టూ పరిభ్రమించే వస్తువులపై వాటి ప్రభావాన్ని అంచనా వేసి వాటి ఉనికిని కనుగొనడానికి వీలవుతుంది. ముఖ్యంగా గ్రహ వలయాలపై వాటి ప్రభావం ఏ విధంగా ఉందో పరిశీలించ వచ్చు.

First alien moon found scientists