Home తాజా వార్తలు ఆర్జియుకెటికి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల…

ఆర్జియుకెటికి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల…

RGUKT

 

నిర్మల్‌ :  బాసరలోని  రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జియుకెటి) ట్రిపుల్ ఐటికి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదలైంది. 2019-20 విద్యా సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఉపకులపతి అశోక్‌కుమార్‌ విడుదల చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో మొత్తం 1500 సీట్లకు 34,217 దరఖాస్తులు అందాయి.

తొలి విడతలో 1404 సీట్లకు ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. విద్యార్థుల్లో అత్యధికంగా బాలికలకు 68 శాతం, బాలురకు 32శాతం సీట్లు కేటాయించారు. తొలిసారి ఎన్నారై కోటాలో నైజీరియా విద్యార్థికి ఆర్జీయూకేటీలో సీటు దక్కింది. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 25, 26 తేదీల్లో క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

First list of Students selected for RGUKT is Released