‘భరత్ అనే నేను’తో పెద్ద హిట్‌ను అందుకున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. నెక్స్ షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్‌ను బయటపెట్టడం లేదు. కనీసం ఫస్ట్‌లుక్ కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. ఆగస్టు 9న మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్ చెబూతూ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. మహేష్ అభిమానులకు గిఫ్ట్‌గా వీటిని రిలీజ్ చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.