Search
Friday 21 September 2018
  • :
  • :

ప్రజలకు మేలు జరిగే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వండి

Collector1

వనపర్తి ప్రతినిధి: ప్రజలకు మేలు జరిగే వార్తలను సేకరించి ప్రభుత్వం , అధికారుల దృష్టికి తీసుకువచ్చే వార్తలకు  జర్నలి స్టులు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు.  ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాల యంలో వనపర్తి జిల్లా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఆమె జర్న లిస్టులను ఉద్దేశించి మాట్లా డుతూ వనపర్తి జిల్లా అభివృద్దిలో చాలా వెనుకబడి ఉందని మీడియా, అధికా రుల  సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ది చేద్దామని   ఆమె పిలుపు నిచ్చారు. చిన్నచిన్న వార్తలను పెద్దదిగా చేసి చూపించవద్దని ఉన్నదిఉన్నట్లుగా నిజాలు వ్రాయాలని ప్రజలకు మేలు జరిగే విధంగా వార్తలు ఉండాలని ప్రజలకు , ప్రభుత్వానికి పత్రికలు , జర్నలిస్టులు వార ధిగా పని చేయాలని ఆమె కోరారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ఆమె తెలి పారు.

కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్, డిపిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, టియు డబ్లుజె జిల్లా అధ్యక్షులు మధుగౌడ్, జర్నలిస్టు సంఘం నాయకులు మల్యాల బాలస్వామి , పౌర్ణారెడ్డి , కొండన్న యాదవ్,రవీందర్ రెడ్డి ,పొలి శెట్టి బాలకృష్ణ,నాగేంద్రమాచారి, కృష్ణయ్య, బి రమేష్, యాకుబ్, రవీం దర్, నగేష్,రాజేందర్, ఫోటోజర్నలిస్ట్ యాదిరెడ్డి, మాధవరావు, తదితరులు ఉన్నారు.

Comments

comments