Home తాజా వార్తలు బడ్జెట్‌లో సంక్షేమానికి తొలి ప్రాధాన్యత :ఈటల

బడ్జెట్‌లో సంక్షేమానికి తొలి ప్రాధాన్యత :ఈటల

ETALA

హైదరాబాద్ : బడ్జెట్‌లో సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదరికం ప్రమాణికంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణపై జిఎస్‌టి ప్రభావం పెద్దగా ఉండదని చెప్పారు. జూన్‌లో నాల్గో విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తామని ఆయన వివరించారు. తెలంగాణను అప్పుల రాష్టంగా మారుస్తున్నామన్నది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమేనని, అప్పులు చేయకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు సహకారం ఉందన్నారు. ప్రభుత్వంపై బురద జల్లకుండా తాము చేస్తున్న అభివృద్ధికి విపక్షాలు సహకరించాలని ఆయన సూచించారు.