Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఎల్ అండ్ టి వాటాల బైబ్యాక్

First quarter results,company had a net profit of 36 percent

న్యూఢిల్లీ: దేశంలో అతి పెద్ద ఇంజినీరింగ్ అండ్ కన్స్‌ట్రక్షన్ కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్ అండ్ టి) ఆగస్ట్ 23న జరిగే సమావేశంలో వాటాల బైబ్యాక్‌ను పరిశీలిస్తామని శనివారం స్టాక్ ఎక్సేంజీకి తెలిపింది. కంపెనీకి చెందిన డైరెక్టర్లు, అధికారులు, నియమిత సిబ్బందికి చెందిన సెక్యూరిటీల లావాదేవీలు చూసే ట్రేడింగ్ విండోను ఆగస్టు 20 నుంచి 24 వరకు మూసి ఉంచనునట్లు కూడా తెలిపింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తొలి త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం 36 శాతం పెరిగినట్లు తెలిపింది. నికర లాభం జూన్ 30 నాటికి రూ. 1215 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇటీవల భారతీయ కంపెనీల్లో వాటాల బైబ్యాక్ తాకిడి పెరుగుతోంది.

గత నెల హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కూడా రూ. 4000 కోట్ల విలువ చేసే వాటాల బైబ్యాక్‌ను ఆమోదించింది. ఐటి దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో కపంపెనీలు కూడా ప్రజల నుంచి వాటాలు తిరిగి కొనేందుకు పెద్ద మొత్తంలో డబ్బు వ్యయం చేస్తున్నాయి. గత నవంబర్‌లో ఇన్ఫోసిస్ రూ. 13,000 కోట్ల విలువ చేసే వాటాలను తిరిగి కొనింది. కాగా విప్రో తన బైబ్యాక్ కార్యక్రమంలో రూ. 11,000 కోట్ల విలువ చేసే వాటాలను తిరిగి కొనుగోలు చేసింది.

Comments

comments