Search
Saturday 22 September 2018
  • :
  • :

అందమైన చందమామ నీవేనా…

sai

సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్’. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని మొదటి పాటను రొటీన్‌కు భిన్నంగా విడుదల చేశారు. ‘తేజ్ క్రికెట్ ప్రీమియర్ లీగ్’ పేరుతో ‘తేజ్  ఐ లవ్ యు’ యూనిట్ సభ్యులు, రేడియో జాకీల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భాగంగా ‘అందమైన చందమామ నీవేనా… నిన్ను నేను అందుకుంది నిజమేనా..’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను లాంచ్ చేశారు. సాహితి రచించిన ఈ పాటను హరిచరణ్, చిన్మయి గానం చేయగా గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను ప్యారిస్‌లో శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు. జయప్రకాశ్, పవిత్రా లోకేష్, పృథ్వీ, సురేఖావాణి, వైవాహర్ష తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః ఆండ్రూ.ఐ,  పాటలుః చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సాహితి, పోతుల రవికిరణ్, గోశాల రాంబాబు, మాటలుః  డార్లింగ్ స్వామి, ఎడిటర్‌ః ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్‌ః సాహి సురేశ్.

Comments

comments