Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

నీల్వాయి ప్రాజెక్టుకు మొదటి దశ అటవీ అనుమతులకు మార్గం సుగమం…

Neelwai-Project

హైదరాబాద్: నీల్వాయి ప్రాజెక్టుకు మొదటి దశ అటవీ అనుమతులకు మార్గం సుగమమైంది. చైన్న ప్రాంతీయ పర్యావరణ కమిటీ అనుమతులివ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రాజెక్టు కోసం 18 హెక్టార్ల అటవీ భూమి వినియోగించేందుకు అనుమతి కావాలని కోరింది. నీల్వాయి ప్రాజెక్టు ద్వారా 13 వేల ఎకరాలకు నీరందించేదుకు వెసులుబాటు కల్పించనుంది. తొలి దశ అటవీ అనుమతి రావడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.

రెండో దశ అనుమతుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గట్టు ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయన్నారు. రేలంపాడు నుంచి పెంచికల పాడు జలాశయానికి నీరు తరలించేందుకు అనుమతులు లభించాయని వెల్లడించారు. ఈ పథకం ద్వారా జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్ మండలాల ఆయకట్టుకు నీరు అందించవచ్చని వివరించారు. రూ. 553.98 కోట్ల వ్యయంతో గట్టు ఎత్తిపోతల పనులు మంజూరయ్యాయని, రెండు దశల పనులకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. రూ.459.05 కోట్లతో మొదటి దశ, రూ.98.93 కోట్లతో రెండో దశ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.

Comments

comments