Home సినిమా తొలి స్టీరియోస్కోపిక్ 3డి హార్రర్ మూవీ

తొలి స్టీరియోస్కోపిక్ 3డి హార్రర్ మూవీ

Anjali

అందాల తార అంజలి వైవిధ్యమైన పాత్రలో నటించిన చిత్రం ‘లీసా’. పిజి మీడియా వర్క్ సమర్పిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ “సినిమా షూటింగ్ 100 రోజులకు పైగా జరిగింది. హీరోయిన్ అంజలి ఈ సినిమాలో వైవిధ్యమైన పాత్రలో నటించారు. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అదేవిధంగా సామ్ జోన్స్, మకరంద్ దేశ్‌పాండే అద్భుతంగా నటించారు. పద్మశ్రీ, గిన్నీస్ రికార్డులను అందుకున్న బ్రహ్మానందం ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించారు. రెండు దశాబ్దాల క్రితం తెలుగు, కన్నడంలో హీరోయిన్ చేసిన సలీమా ఓ మంచి పాత్రలో కనిపిస్తారు. సబితారాయ్, సురేఖ వాణి తమ పాత్రల్లో చక్కగా నటించారు”అని అన్నారు. నిర్మాత ముత్తయ్య మాట్లాడుతూ “ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా సినిమాటోగ్రాఫర్‌గా కూడా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నా యి. ఇందులో అంజలి అద్భుతంగా నటించారు. తాజాగా అంజలి ఉన్న ‘లిసా’ పోస్టర్‌ను పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. ఇండియాస్ ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3డి హార్రర్ మూవీగా ఈ సినిమాను హీలియం 8కె కెమెరాతో చిత్రీకరించాం. ఈ సినిమాను ఈ డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నాం”అని తెలిపారు. అంజలి మాట్లాడుతూ “మొదటిసారి 3డి చిత్రంలో నటిస్తున్నాను. దర్శకుడు రాజుకు స్క్రిప్ట్‌పై మంచి క్లారిటీ ఉంది. ఏదైతే చెప్పారో అదే తీశారు. ఇలాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. సంతోష్ అందించిన బాణీలు ప్రేక్షకులను అలరిస్తాయి”అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌ః ఎస్.ఎన్.ఫాజిల్, కొరియోగ్రఫీః సురేష్, ఆర్ట్‌ః వినోద్.

 First Stereoscopic 3D Horror Movie Lisaa 

Telangana News