Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

విరాట్ వీరోచిత్ పోరాటం

vrt కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్న కోహ్లి 

 చేతులెత్తేసిన మిడిలార్డర్ 

 తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 1౩ పరుగుల ఆధిక్యం

ఎడ్జ్‌బాస్టన్(బర్మింగ్‌హామ్): టీమిండియా కెప్టెన్ చేసిన ఒంటరి పోరాటం విఫలమైంది. ఇంగ్లాండ్ బౌలర్లు కురేన్, స్టోక్స్ భారత జట్టు మిడిల్ ఆర్డర్‌ను కూల్చడంతో తొలి ఇన్నింగ్స్‌లోనే భారత జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ చివరికి 13 పరుగుల తేడాతో టీమిండియాపై ఆధిక్యత సాధించింది. ఇంగ్లాండ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ సామ్ కురెన్ టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో మొదటి టెస్టు రెండో రోజున కోహ్లి సేనకు చుక్కలు చూపించాడు. ఈ యువ బౌలర్ టీమిండియా ఆర్డర్‌ను ధనాధన్ దెబ్బ తీశాడు. అంతేకాక తన ఖాతాలో రికార్డు వేసుకున్నాడు. తొలి వికెట్‌కు శిఖర్ ధవన్, మురళీ విజయ్ 50 పరుగులు జోడించారు. దాంతో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుకు గట్టి పోటీ ఇవ్వొచ్చనిపించింది. కానీ 14 ఓవర్లో కురేన్, మురళీ విజయ్ ఔట్ చేశాడు. తర్వాత 4 వికెట్లు తీసి తన ఖాతాలో రికార్డు చేశాడు. 20 ఏళ్ల వయస్సులో, 60 రోజుల్లో 4 వికెట్లు తీసుకుని తొలి ఇంగ్లాండ్ యువ బౌలర్‌గా రికార్డు సృష్టించుకున్నాడు.
విరాట్ 1000 పరుగులు
ఇంగ్లాండ్ పిచ్‌పై విరాట్ కోహ్లి తొలి టెస్ట్‌లో 22వ శతకం చేశాడు. అంతేకాక ఇంగ్లాండ్‌పై 1000 పరుగులు పూర్తి చేశాడు. ఇన్ని పరుగులు చేసిన భారతీయ క్రికెట్‌లో కోహ్లి 13వ క్రికెటర్. దీంతోపాటు కోహ్లి ఇంగ్లాండ్‌పై తన వ్యక్తిగత అత్యధిక స్కోరును నమోదు చేశాడు.

eng
బెన్‌స్టోక్స్ అరుదైన రికార్డు
హార్దిక్ పాండ్యను ఔట్ చేయడంతో బెన్‌స్టోక్స్ తన 100వ వికెట్ తీసుకున్నాడు. అంతేకాక 2500 పరుగులు, 100వ వికెట్ డబుల్ చేయడంలో ఇంగ్లాండ్ ఐదో ఆటగాడిగా నిలబడ్డాడు. స్టోక్స్‌కు ముందు టోనీ గ్రెగ్, ఇయాన్ బాథమ్, ఎండ్యూ ఫిల్టాఫ్, స్టూవర్ట్ బ్రాడ్ ఈ ఫీట్ సాధించారు.
287కు ఇంగ్లాండ్ ఆలౌట్
భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రెండో
ఆట ప్రారంభైన కొద్ది నిమిషాలకే ఇంగ్లాండ్ ఆలౌటైంది. రెండో రోజు రెండో ఓవర్‌లో నాలుగో బంతికే ఇంగ్లాండ్ తన ఏకైక వికెట్‌ను కోల్పోయింది. 90వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ వేసిన 4వ బంతిని ఎదుర్కొన్న కర్రన్(24)… వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ 4, మహమ్మద్ షమి 3, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మకు చెరో వికెట్ దక్కింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు రూట్(80), బెయిర్‌స్టో(70), జెన్నింగ్స్ (42) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేయగలిగారు.

Comments

comments