Home జాతీయ వార్తలు తొలిసారి హిందీలో బడ్జెట్ ప్రసంగం…

తొలిసారి హిందీలో బడ్జెట్ ప్రసంగం…

Arun-Jaitley1

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రేపు(గురువారం) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎప్పుడూ ఇంగ్లీష్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక శాఖ మంత్రి తొలిసారి హిందీలో బడ్జెట్ విషయాలను వివరించనున్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్‌లో అధిక మొత్తం వ్యవసాయం, మౌలిక సదూపాయాల కల్పనకు కేటాయించే వీలుందని సమాచారం. దీనికోసం గ్రామీణులకు, రైతులకు అర్థమయ్యే విధంగా ఈసారి హిందీలో ప్రసంగం చేస్తే బాగుంటుందని జైట్లీ నిర్ణయించారట. దీంతో హిందీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తొలి ఆర్థిక శాఖమంత్రిగా జైట్లీ నిలవనున్నారు.