Home వనపర్తి పెరిగిన చేపపిల్లలు..మత్స్యకారుల్లో ఆనందం

పెరిగిన చేపపిల్లలు..మత్స్యకారుల్లో ఆనందం

Fish

అమరచింత : తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మత్సకారుల అభివృద్ది కోసం నాలుగు నెలల క్రి తం ప్రతి చెరువుకు ఉచితంగా చేపలను పంపిణీ చేసిం ది. అందులో భాగంగా మత్సకారుల సంఘానికి ఎం ఎల్‌ఎ చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి,ఎంపిపి శ్రీధర్‌గౌడ్, ప్ర జాప్రతినిధులు, అధికారులు అమరచింత చెరువులో 60 వేల చేపపిల్లలను వదిలారు.భూత్పూర్ రిజర్వా య ర్ నుండి అమరచింత పెద్దచెరువుకునీళ్లు భారీగా తీసు కొచ్చారు. ఈ నేపథ్యంలో మత్సకారులు  1 లక్షా 80 వేల చేపపిల్లలను మత్సకారుల సంఘం ఆధ్వర్యంలో వదిలారు.

చేపపిల్లలు భారీగా పెరిగాయి. మంగళవారం మత్సకారుల సంఘం నాయకులు చెరువులోని చేపలను పరిశీలించారు . చేపలు భారీగా పెరగడంతో మత్సకారుల ఆనందం వెల్లివిరసింది. గత 7 సంవత్స రాల నుండి చెరువులో నీళ్లు లేక చేపలను వదలడం లేదని ఇన్ని సంవత్సరాల పాటు మత్సకారులు క ష్టా ల్లో బ్రతికారని ఆ సంఘం నాయకులు రవికాంత్, బా ల్‌రాం, మన తెలంగాణ విలేకరికి తెలిపారు. నేడు చేప లు భారీగా పెరగడంతో  తమ కుటుంబాలు ఆర్థికంగా బాగుంటాయని వారు ఆశా భావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా  తెలంగాణ ప్రభుత్వం మత్సకారులకు కృషి చేయడం అభినందనీ యమ న్నారు. మత్సకారుల సంక్షేమానికి పాటు పడుతున్న సిఎం కెసిఆర్, ఎంఎల్‌ఎకు  మత్సకారుల సంఘం సభ్యులు రమేష్, రవికాంత్, నాగరాజు, వెంకటేష్, శ్రీనివాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.