Home తాజా వార్తలు చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి

చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి

 Fisherman killed by fish Hunter In Nalgonda District

మిర్యాలగూడ: రిజర్వాయర్‌లో  చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన గరిడేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్ధానికులు,బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లికి చెందిన ఈదె కోటయ్య(53) గానుగుబండ రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుని పంచనామా కోసం హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.