Home అంతర్జాతీయ వార్తలు మత్స్యకారుల అరెస్ట్

మత్స్యకారుల అరెస్ట్

FISHERMANఅహ్మదాబాద్ : చేపల వేటకు వెళ్లిన ఆరుగురు భారతీయ మత్స్యకారులను పాక్ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం గుజరాత్ తీరంలోని అంతర్జాతీయ జలాల సరిహద్దు సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్థాన్ మారిటైమ్ అథారిటీస్ ఇన్ ద అరేబియన్(పిఎంఎస్‌ఎ) అధికారి ఒకరు తెలిపారు. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా మంగ్రోల్ గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులను నవదుర్గ అనే పడవలో ఓఖా తీరం నుంచి ప్రయాణమయ్యారు. కచ్ జిల్లా, జఖాపు తీరం వద్దకు చేరుకున్న వీరిని అంతర్జాతీయ సముద్ర సరిహద్దు సమీపంలో పట్టుకుని అరెస్ట్ చేసినట్లు పిఎంఎస్‌ఎ అధికారి మనీష్ లోధారి వెల్లడించారు. వారు ప్రయాణిస్తున్న పడవను స్వాధీనం చేసుకుని సమాచారాన్ని భారతీయ కోస్ట్‌గార్డ్ అధికారులకు అందించామని ఆయన పేర్కొన్నారు. 2016, ఆగస్టు 15 తర్వాత కొత్తగా ప్రారంభమైన ఫిషింగ్ సీజన్లో పిఎంఎస్‌ఎ సిబ్బంది తీసుకున్న మొదటి చర్య ఇదేనని ఆయన వెల్లడించారు. ఇప్పటికే గుజరాత్‌కు చెందిన సుమారు 465మంది మత్స్యకారులు పాక్ జైళ్లలో మగ్గుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సముద్ర జలాల సరిహద్దుపై సరైన స్పష్టత లేకపోవడంతో తరచూ మత్స్యకారులు సరిహద్దు దాటి పాకిస్థాన్ అధికారులకు పట్టుబడుతున్నారు.