Home జాతీయ వార్తలు ముగియనున్న చేపల వేట నిషేధం

ముగియనున్న చేపల వేట నిషేధం

Fishermanచెన్నయ్ : తమిళనాడులో 45 రోజుల చేపల వేట నిషేధం ఆదివారం ముగియనుంది. జాలర్లు సోమవారం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లవచ్చని అధికారులు తెలిపారు. అయితే శ్రీలంక, భారత జాలర్ల సమస్య పరిష్కారానికి నాలుగో విడత సమావేశాలు త్వరలో ప్రారంభించాలని జాలర్లు కోరారు. తమిళనాడు తూర్పు తీర ప్రాంతంలో చేపల సంతానోత్పత్తి కోసం ఏప్రిల్ 15 నుంచి మే 29వ తేదీ వరకు 45 రోజుల పాటు చేపల వేటను నిషేధించిన విషయం తెలిసిందే.