Home లైఫ్ స్టైల్ సోషల్ మీడియాతో ఫిట్‌నెస్

సోషల్ మీడియాతో ఫిట్‌నెస్

ఒక చిత్రం వెయ్యి పదాలకు సమానం అంటారు. చిత్రాలు చూడటం ద్వారా ఏ విషయమైనా   త్వరగా  బోధపడుతుంది. సోషల్ మీడియాలో  ప్రచారాల ద్వారా అటువంటివి  చాలా చూస్తున్నాం.  సోషల్‌మీడియా ప్రభావంతో అనుప్రియ రాఘవ్  బరువుతగ్గి తనేంటో నిరూపించుకుంది.

life

సోషల్ మీడియాలో వచ్చే ఫిట్‌నెస్ కార్యక్రమాలు, ఇంకా ఆరోగ్యవంతమైన జీవనశైలి కార్యక్రమాలు ఐటి నిపుణురాలు అనుప్రియ రాఘవ్ బరువు తగ్గడానికి కారణమైంది. 110 కిలోగ్రాముల బరువున్న అనుప్రియ సోషల్ మీడియా ద్వారా ఫిట్‌నెస్ కార్యక్రమాల ప్రేరణతో తన బరువులో 42 కిలోలు తగ్గించుకోగలిగింది. కేవలం ఒక సంవత్సరకాలంలో క్రమశిక్షణతో వ్యాయామాలు చేసి చాలామందికి ఉదాహరణగా నిలిచింది. ఆమె బరువు తగ్గటానికి ఒకవ్యక్తిగానీ, పరిస్థితి గానీ కారణం కాదు. కానీ ఆమె ఆచరించిన పద్ధతి అందరూ తెలుసుకోవాల్సిందే. కచ్చితమైన ప్రయత్నాలు, సర్దుబాట్లతో ఆమె 42 కేజీల బరువు తగ్గింది. ఆరోగ్యకరమైన శరీరానికి ఒక కఠినమైన పద్ధతే పాటించనవసరంలేదు. నేను ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ని అనుసరించాను. అది నాకు మంచి జీవనశైలిని, ఇంకా ఫిట్‌నెస్‌ని ఇచ్చిందని అనుప్రియ చెప్పింది. సరదాగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఒక బౌల్ నిండా ఐస్‌క్రీం తినేస్తాను. కేలరీలు లెక్కచేయను. వెంటనే దానికి తగ్గట్టు వ్యాయామం చేస్తానంటోంది. ఆమె ప్రతిరోజూ 3 గుడ్లు, బాదం వేసిన 20 గ్రాముల నల్ల కాఫీ సేవిస్తుందిట. మధ్యాహ్నం భోజనంలో 200 గ్రాముల కూరగాయలు, పెరుగు, 100 గ్రాముల బోన్‌లెస్ చికెన్ తీసుకుంటుంది. రాత్రికి 100 గ్రాముల బియ్యం, 40 గ్రాముల పప్పు, 100 గ్రాముల పనీర్ తీసుకుంటూ.. వారంలో ఆరు రోజులపాటు 90నిముషాలు వ్యాయామం చేస్తానంటనోంది. కాలీఫ్లవర్ రైస్, పాలక్ పనీర్ టిక్కిస్ లాంటి తక్కువ కేలరీల ఉన్న వంటకాన్ని ఇష్టంగానే తింటుంది. పదార్థాలని తగ్గించింది. ప్రతి పదార్థం నెయ్యితోనే వండుతాను. ఉప్పు తగినంత వేసి, నీరు ఎక్కువగా ఉన్న ఆకుకూరలు ఎక్కువగావండుకుంటుందట. చక్కెర లేకుండా వండే ప్రతి పదార్థం కొలత తీసుకుని క్రమపద్ధతిలో వండుకుని తింటుంది. ప్రతిరోజూ 90—120 నిముషాలు జిమ్ చేస్తాను అని అనుప్రియ తన ఆహార విషయాలను వెల్లడించింది. తగ్గించుకోవటానికి కఠినంగా నియమాలు పాటిస్తూ ఆకలితో బాధపడనవసరంలేదు. వ్యాయామంతో బరువు తగ్గుతుంది. కండరాలు బలంగా కూడా ఉంటాయి అని ఆమె తన అను ఫిట్‌నెస్ రహస్యాన్ని వెల్లడించింది. తగ్గడానికి ప్రతిరోజూ చికెన్ బిర్యాని సరైన పద్ధతిలో వండుకుని తినాలి. మీ శరీరం తీరైన ఆకృతికి రావడానికి క్రమశిక్షణ, సహనం అవసరమని సలహా చెపుతోంది. నన్ను చూసి కంపెనీలో చాలామంది అప్పుడప్పుడు వారు కూడా బరువు తగ్గడానికి ఉత్సాహం చూపించేవారు. కొంతమంది సలహాలు తీసుకునేవారు. వారికి సలహాలిస్తూ నేను నా లక్షాన్ని చేరుకోగలిగాను. నిత్యజీవితంలో ప్రతి అంశంలోనూ ఫిట్‌నెస్‌ను అనుకరిస్తున్నానని చెప్పింది. ఎక్కువ బరువు కనిపించకుండా సరైన దుస్తులను ఎంపిక చేసుకోవడం, ఆరోగ్యపరంగా శ్రద్ధగా ఉండటం సరిగా పాటించాలి.వచ్చే 10 సంవత్సరాలలో నేను నా లక్షాన్ని నెరవేర్చుకుంటాను. రాబోయే సంవత్సరానికి ఫిట్‌నెస్ శిక్షకురాలిగా, ఇంకా పోషకాహార నిపుణురాలిని అవుతానని నమ్మకంగా చెబుతోంది. నాకు 110 కిలోగ్రాముల బరువు తగ్గించుకోవటం కష్టమైనపని అనిపించలేదు. ప్రతి ఒక్కరు అందమైన శరీరాకృతి, బరువు ఉండాలి. మనం తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందం పొందవచ్చు. శ్రద్ధతో ఏ పని చేసినా అది విజయవంతమవుతుందని చెప్పింది అనుప్రియ రాఘవ్.