Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

క్రెడిట్ కార్డులతో రూ.5 కోట్ల మోసం

Cyber Criminals Attack on Credit and Debit Cards

హైదరాబాద్: బ్యాంకు ఖాతాదారుల కార్డులతో మోసాలకు పాల్పడుతున్న 30 మంది గల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఐదు కోట్ల రూపాయల మేర మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఎస్‌బిఐ క్రెడిట్ కార్డు ఖాతాదారులను మాత్రమే మోసగిస్తున్నారని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఈ మోసంలో ఢిల్లీకి చెందిన విజయ్‌కుమార్ శర్మ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రెండు వేల మంది నుంచి ఐదు కోట్ల రూపాయల మేర మోసగించినట్టు వెల్లడించారు. ఢిల్లీలోని మూడు కాల్ సెంటర్ల ద్వారా కార్యకలాపాలు జరుగుతున్నాయని వివరించారు. ఢిల్లీ నుంచి కార్యకలాపాలు సాగుతుండటంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మోసాలు బయటపడుతున్నాయని, కనీసం ఒక్కో కార్డు నుంచి రూ.8,500 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. ఎస్‌బిఐ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నారని, 30 మంది నిందితుల్లో ఎనిమిది మంది పాత్రదారులు, 22 మంది టెలీకాలర్స్‌గా గుర్తించామని, కేసును ఛేదించిన సిబ్బందికి సిపి ప్రోత్సాహకాలు అందజేశారు.

Comments

comments