Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్యాయత్నం

Drown-Swimming

కొత్తపేట: ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపేటలో విషాదం చోటుచేసుకుంది. కోత్తపేట మండల కేంద్రంలోని వలివెల కాల్వలో దూకి ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరిని కాపాడి కాల్వలోంచి బయటకు తీశారు. అయితే ఇద్దరిలో ఓ బాలుడు కొద్దిసేపటికే మృతిచెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుల వివరాలు సేకరిస్తున్నారు.

Comments

comments