Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

అనుమానాస్పదంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి!

Five Family Members Found Dead in Dhumanganj

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అలహాబాద్‌లోని దమన్‌గంజ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతి చెందిన వారిలో భార్యాభర్తలతో పాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భర్త ఇంట్లో ఉరి వేసుకుని ఉండగా, భార్య శవం ఫిడ్జ్‌ల్రో ఉంది. అలాగే ఒక కూతురు శవం సూట్‌కేసులో, మరో కూతురి శవం అల్మారాలో, ఇంకొక అమ్మాయి శవం ఓ రూంలో పడి ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులకు ఈ హృదయవిదారకర దృశ్యాలు కనిపించాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా, భార్యను, ముగ్గురు కూతుళ్లను భర్తే హత్య చేసి, ఆపై తాను ఉరి వేసుకుని ఉంటాడని అలహాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments