Home తాజా వార్తలు ప్రైవేటు బస్సు బోల్తా: ఇద్దరి మృతి

ప్రైవేటు బస్సు బోల్తా: ఇద్దరి మృతి

Two Persons Died in Road Accident in Guntur

నాగర్‌కర్నూల్ :  ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటన శ్రీశైలానికి సమీపంలోని శ్రీశైలం టోల్‌గేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నాగర్ కర్నుల్ లోని రామయ్య మలుపు వద్ద బస్సు అతి వేగంగా వచ్చి బోల్తా పడడంతో ఇద్దరు భక్తులు దుర్మరణం చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి  పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.