Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

విమానం కూలి ఐదుగురు మృతి

America : Five People dead in Southern California Plane Crashకాలిఫోర్నియా : కాలిఫోర్నియాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. శాంటా అనా నగరంలోని స్టాప్లెస్ సూపర్‌సెంటర్ షాపింగ్ మాల్ పార్కింగ్ ప్రాంతంలో రెండు ఇంజన్లు గల చిన్న విమానం కూలిపోయిందని , అందులో ప్రయాణిస్తున్న ఐదుగరు చనిపోయారని అధికారులు తెలిపారు. పార్కింగ్‌లో ఉన్న ఓ కారును కూడా విమానం ఢీకొట్టిందని, అయితే ఎవరూ గాయపడలేదని వారు వెల్లడించారు. ప్రమాదానికి గురైన ఈ విమానం శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని ఓ కంపెనీ పేరిట రిజిస్టర్ అయి ఉంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) ఈ వివరాలను వెల్లడించింది. కాంకోర్డ్ సిటీ ఈస్ట్ బే సబర్బ్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఆరెంజ్ కౌంటీలోని జాన్ వేన్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న షాపింగ్ మాల్‌లో కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాద ఘటనపై ఎఫ్‌ఎఎ దర్యాప్తు చేపట్టింది. జాతీయ రవాణా భద్రత సంస్థ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తుందని అధికారులు తెలిపారు.

Five People dead in Southern California Plane Crash

Comments

comments