Home అంతర్జాతీయ వార్తలు రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి

రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి

Train Accidentఢాకా : బంగ్లాదేశ్ లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉంది. కులౌరా ఉపాజిలాలోని బరాంచల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. రైలు వంతెన దాటుతుండగా ఉప్ బనన్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన నాలుగు  బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో రెండు బోగీలు కిందనున్న కాలువలో పడిపోయాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

Five People Dead in Train Accident At Bangladesh