Home తాజా వార్తలు ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి

Car-Accident

బారాబాంకి : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు కాల్వలోకి దూసుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.