Search
Thursday 15 November 2018
  • :
  • :

సముద్రంలో మునిగి ఐదుగురు మృతి

Five People died with Drowning in Sea

ముంబయి : ముంబయిలోని బొరివాలి ప్రాంతంలో రత్నగిరి వద్ద సముద్రంలో మునిగి ఐదుగురు మృతి చెందారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. రత్నగిరి జిల్లా గన్నతిపూలె వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గన్నతిపూలెకు 15కిలోమీటర్ల దూరంలో ఉన్న అరేవేర్ బీచ్ వద్ద వీరు స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. అకస్మాత్తుగా అలలు రావడంతో వీరు సముద్రంలో కొట్టుకపోయారు. అయితే స్థానికులు ఇద్దరిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. సముద్రం నుంచి ఐదుగురి మృతదేహాలను వెలికి తీశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Five People died with Drowning in Sea

Comments

comments