Home ఆంధ్రప్రదేశ్ వార్తలు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి

Five Students dead in Road Accident at Gunturగుంటూరు : గుంటూరులోని లాలుపురం దగ్గర హైవేపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగరు విద్యార్థులు చనిపోయారు. వేగంగా వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొన్న అనంతరం లారీని ఢీకొంది. మృతులు ఆర్‌విఆర్ కాలేజీలో బిటెక్ చదువుతున్నారు. కాలేజీ నుంచి విజయవాడ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్, క్లీనర్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు మృతులు ధనుష్, కోటేశ్వర్ రావు, సాయిరాంలను గుర్తించారు. మరో ఇద్దరు మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Five Students dead in Road Accident at Guntur