Search
Saturday 17 November 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి

Five Students Were Killed in Road Accident

భువనేశ్వర్ : ఒడిశాలోని భద్రక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థినులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. భద్రక్‌లోని జాతీయ రహదారి-16పై వేగంగా వచ్చిన ట్రక్కు విద్యార్థినులపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థినులు రోడ్డు క్రాస్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం చెందిన స్థానికులు ట్రక్కుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Five Students Were Killed in Road Accident

Comments

comments