Home జాతీయ వార్తలు ఒకరికి వేధింపులు.. ఐదుగురు ఆత్మహత్య

ఒకరికి వేధింపులు.. ఐదుగురు ఆత్మహత్య

Farmer-suicidesకర్ణాటక : రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేధింపులు తాళలేక ఒకే కుటంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగమంగల్ తాలూకాలోని మరదేవనహల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మీనాక్షమ్మ (55) అనే మహిళ తన కుమార్తెలు యోగశ్రీ (20), పద్మశ్రీ (22), సుచిత్ర (26), కుమారుడు యోగానంద (16)లతో కలిసి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాలడింది. మీనాక్షమ్మ భర్త రామెగౌడ స్కూల్ టీచర్‌గా పనిచేసే వారు. అయన మూడు నెలలు క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మీనాక్షమ్మ కూడా స్కూల్ టీచర్‌గా పని చేస్తు కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. పెద్ద కూతురు సుచిత్రకు రెండేళ్ల క్రితం పెళ్లైంది కాని ఆమె తన భర్తతో ఉంటట్లేదని పోలీసులు తెలిపారు. సుచిత్ర అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక మీనాక్షమ్మ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.