Home జాతీయ వార్తలు ఐదుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

ఐదుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

Five Terrorists Encounter in Jammu Kashmir

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లా బడిగాం వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బడిగాం గ్రామ సమీపంలో భద్రతా బలగాలు ఆదివారం ఉదయం తనిఖీలు చేశాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారు. హతులు హిజ్యుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. గత శుక్రవారం కశ్మీర్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను కిడ్నాప్ చేసింది వీరే కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Five Terrorists Encounter in Jammu Kashmir