Home తాజా వార్తలు ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

Encounter

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బందిపొరాలో శనివారం సాయంత్రం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి. బందిపొరాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడంతో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Five Terrorists were killed in the Encounter