Home జాతీయ వార్తలు కటకటాల్లో కండల వీరుడు

కటకటాల్లో కండల వీరుడు

slmn

కృష్ణజింక వేటా కేసులో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు 

  నిర్దోషులుగా టాబూ, నీలం , సోనాలీ బింద్రే, సైఫ్ అలీఖాన్ 

‘సల్మాన్ ఓ నటుడు. ప్రజలు ఆయన్ను చూస్తూ ఉంటారు. అంతేకాదు.. అనుకరిస్తారు. అటువంటి వ్యక్తి ఓ అమాయక జింకను దారుణంగా వేటాడి చంపడం ఎంతమాత్రం సమంజసం కాదు’

జోధ్‌పూర్ : కృష్ణజింకలను (నల్ల దుప్పులను) వేటాడి రెండింటిని వధించిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు స్థానిక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 1998 నాటి ఈ కేసుకు సంబంధించి గురువారం న్యాయస్థానం సల్మాన్‌ను దోషిగా నిర్థారించింది. వెంటనే ఆయనను జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ కేసులోనే సల్మాన్‌తో పాటు సహ నిందితులు అయిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ అందాల తారలు టాబూ, నీలం , సోనాలీ బింద్రేలను సరైన సాక్షాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించారు. దీనితో దాదాపు 2౦ ఏళ్ల కిందటి కేసులో ఇప్పుడు సల్మాన్ ఒక్కడే దోషిగా చిక్కాడు. ఈ కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జై లు పడటంతో నిబంధనల మేరకు ఆయన ఎగు వ న్యాయస్థానంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. సల్మాన్‌కు ఐదేళ్ల జైలు విధించినట్లు, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించినట్లు న్యాయస్థానం తీర్పు తరువాత ప్రాసిక్యూషన్ లా యర్ వెల్లడించారు. స్థానిక జోధ్‌పూర్ న్యాయస్థా నం వద్ద గురువారం ఉదయం నుంచే అత్యంత భారీ స్థాయి ఉత్కంఠతో కూడిన సందడి నెలకొం ది. శిక్ష తీవ్రత తగ్గించాలని ముందుగానే సల్మాన్ లాయర్లు అభ్యర్థించారు. అయితే ముందుగా సల్మాన్‌ను దోషిగా ఖరారు చేసిన చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కొంచెం విరామం తరువాత ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. తీర్పు తరువాత బొలేరో పోలీసు జీపులో సల్మాన్‌ను జైలుకు తరలించారు. కోర్టు నుంచి జైలుకు రెండు కిలోమీటర్ల మార్గమధ్యంలో సల్మాన్ అభిమానులు, పౌరులు బారులు తీరి నిలబడ్డారు. ఇక కోర్టు ఆవరణలో తీర్పు తీరు తెన్నులను గమనించేందుకు భారీ స్థాయిలో మీడియా ప్రతినిధులు హాజరు కావడం, భద్రతా సిబ్బంది హడావిడితో అక్కడ షూటింగ్‌కు మించిన సందడి నెలకొంది. 52 సంవత్సరాల కండలవీరుడు సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో గడపడం ఇది కొత్త కాదు. ఈ కేసుకు సం బంధించే ఇంతకు ముం దు ఆయన మూడు సార్లు జైలు లో కొద్ది రోజులు ఉండాల్సి వచ్చింది. అత్యాచారాల అభియోగం లో జైలు పాలయిన మతబోధకుడు ఆశారామ్ బాపు కూడా ఈ జైలులోనే ఉన్నారు. సాధారణంగా మూడేళ్ల జైలు శిక్ష పడ్డ కేసులలో బెయి ల్ ఉన్నత న్యాయస్థానం పరిధిలో ఉంటుం ది.
ఒకే బ్యారక్‌లో ఆశారాం, సల్మాన్
బాలీవుడ్‌లో నటజీవితంలో తిరుగులేని విజయా లు సొంతం చేసుకున్న సల్మాన్‌ను సెంట్రల్ జైలులో బ్యారక్ నెంబరు 2కు తరలించిన ట్లు అధికారులు తెలిపా రు. ఈ సెల్‌కు భారీ స్థా యి భద్రత కల్పించారు. ఇప్పటికే ఈ బ్యారక్‌లోనే ఆశారాం జైలు జీవితం గడుపుతున్నా రు. ఇక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు ఉండటంతో భద్రత కట్టుదిట్టం అయింది. ఈ బ్యారక్‌లో ఎసి, ఫ్యాన్ వంటి సదుపాయాలు ఏమీ ఉండవు. ఇందులోనే బెయిల్ వచ్చే వరకూ ఈ హీరో గడపాల్సి ఉంటుంది. చాలా ఏళ్లుగా నానుతూ వస్తున్న ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణ మార్చి 28న ముగిసింది. తరువాత చీ ఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రీ తీర్పును రిజ ర్వ్ చేసి ఉం చారు. ఇప్పుడు ఐదేళ్ల జైలుతో పాటు పదివేల జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించా రు. ఈ వేటకేసుకు సంబంధిం చే 1998, 2౦౦6, 2౦౦7లలో సల్మాన్ మొత్తం 18 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. మరోవైపు సల్మాన్ తరఫు న్యాయవాదులు ఆయనకు బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వస్తుందని భావిస్తున్నారు.

ఖైదీ నెం.106

salman

సల్మాన్ ఉద్వేగం, కన్నీరుమున్నీరయిన చెల్లెల్లు

sisters

న్యాయస్థానం తీర్పు వినగానే సల్మాన్ కోర్టులో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన పక్కనే ఉన్న ఇద్దరు చెల్లెళ్లు అర్పిత, అల్విరా ఖాన్‌లు కన్నీరుమున్నీరయ్యారు. సల్మాన్‌ను ఓదార్చేందుకు యాంటీ డిప్రెసెంట్లు ఇచ్చారు. బాధతో సల్మాన్ తన చెల్లెళ్ల పక్కనే చాలాసేపటి వరకు ఉండిపోయారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు అక్కడ ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. లైంగిక వేధింపుల కేసులో జైల్లో ఉన్న ఆశారాం బాపు ఉంటున్న గది పక్కనే సల్మాన్‌కు గది కేటాయించారు. సాధారణ ఖైదీల మాదిరిగానే జైలులో కార్యకలాపాలను సల్మాన్ అనుసరించాల్సి ఉంటుంది. సల్మాన్ ఖైదీ నెం.106ను కేటాయించారు. సల్మాన్‌కు కేటాయించిన గదిలో ఎటువంటి ప్రత్యేక సదుపాయా లు కూడా లేవు. కేవలం ఒక ఫ్యాన్ మాత్రమే ఉంది. నేలపైనే ఆయన నిద్రపోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ విక్ర మ్ సింగ్ వెల్లడించారు. సల్మాన్‌కు కేటాయించిన గదిలో ఏ ఖైదీని ఉంచడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో తీర్పు వెలువరించిన వెంటనే సల్మాన్‌ను కోర్టు నుంచి నేరుగా జైలుకే తరలించారు. ఆయన వస్తున్న సందర్భంగా ఎటువంటి భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేలా జైలు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
సల్మాన్‌పై హిట్ అండ్ రన్ కేసు కూడా
హీరో సల్మాన్‌పై ముంబైలో హిట్ అండ్ రన్ కేసు కూడా ఉంది. 2౦౦2 సెప్టెంబర్ 28న సల్మాన్ తన తెలుపు టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాన్ని బాంద్రాలోని హిల్‌రోడ్‌లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బేకరీలోకి దూసుకుపోనిచ్చారనే అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఈ కేసులో తొలుత సల్మాన్ నిర్దోషిగా కోర్టు పేర్కొంది. దీనిని మహారాష్ట్ర ప్రభుత్వం పై కోర్టులో సవాలు చేసింది. ఈ కేసు ఇంకా విచారణ దశల్లోనే ఉంది.
టబునే రెచ్చగొట్టిందట…

tabu
ఆరోజు వేట దశలో తోడుగా ఉన్న నటి టబునే పదేపదే జింకలను కాల్చమని సల్మాన్‌ను కోరిందని స్థానికులు చెప్పడం వి చారణ క్రమంలో వెల్లడైంది. అయితే చెప్పింది టుబునే అని చెప్పడానికి, ఆమెనే సల్మాన్‌ను ప్రేరేపించిందని నిర్థారించడానికి సరైన సాక్షాలు లేకపోవడంతో ఇప్పుడు టబు ఇతరులతో పాటు నిర్దోషి అయ్యారు.

రూ.6౦౦ కోట్ల సినిమాలపై ప్రభావం!

బాలీవుడ్ ఖాన్‌త్రయంలో వెలిగిపోతున్న సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష తీర్పు వెలువడటంతో బాలీవుడ్ చిత్ర నిర్మాతలలో కలవరం రేకెత్తింది. బాక్సాఫీసు కలెక్షన్ల హీరోగా నిలిచిన సల్మాన్‌తో ఇప్పుడు పలు భారీ స్థాయి బడ్జెట్ సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ సినిమాల నిర్మాణ  బడ్జెట్ విలువ రూ 6౦౦ కోట్ల వరకూ ఉండొచ్చునని విశ్లేషిస్తున్నారు. దబాంగ్ 3, రేస్ 3, కిక్ 2 వంటి సినిమాలతో పాటు భరత్ అనే సినిమా కూడా సల్మాన్ హీరోగా నిర్మాణంలో ఉంది. 52 ఏళ్ల ఈ పెళ్లి కాని హీరో సల్మాన్ రేస్ 3 చిత్రీకరణ సగభాగం పూర్తయింది. సినిమాకు దర్శకుడు రెమో డి సౌజా. హీరోకు జైలు శిక్ష పడటంతో తదుపరి సినిమా నిర్మాణం ప్రస్తుతానికి సస్పెన్స్ అని విశ్లేషకులు తెలిపారు.జూన్‌లో ఈ సినిమా విడుదల కావల్సి ఉంది. ఈ లోగానే మిగిలిన షూటింగ్ జరగాల్సి ఉంది. ఇక మిగిలిన సినిమాలు ఇంకా ప్రారంభం కాలేదని, దీనితో వెంటనే ఆర్థిక నష్టం లేకపోయినా, ఈ హీరోతోనే భారీ సినిమాలు తలపెట్టిన నిర్మాతలకు ఇబ్బంది ఏర్పడిందని వెల్లడైంది. భారీ స్థాయి వసూళ్ల గ్యారంటీ ఉండే హీరో సల్మాన్‌ను నమ్ముకున్న నిర్మాతలు ఇప్పుడు దిక్కులు చూడాల్సి వస్తోంది. వరుస బ్లాక్‌బస్టర్‌లు ఉన్న సల్మాన్‌పై ఆశలు పెట్టుకున్న చిత్ర పరిశ్రమకు చిక్కులు తప్పవని సినీ వ్యాపార విశ్లేషకులు గిరీష్ వాంఖేడే తెలిపారు. ఇక ఇప్పటికే సల్మాన్ అంగీకరించిన పలు ఇతర చిత్రాలు, కొన్ని టీవీ షోలపై కూడా తక్షణ ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. టీవీ షో దస్ క దమ్, పలు టీవీ వాణిజ్య ప్రసారాలకు గండిపడుతుందని  విశ్లేషకులు అమోద్ మెహ్రా తెలిపారు. మొత్తం మీద ఇప్పటికైతే రేస్ 3 కేవలం డబ్బింగ్ మిగిలి ఉంది. ఈ దశలో సినిమా ఆగకపోవచ్చు. అనుకున్నట్లుగానే ఈద్‌కు విడుదల కావచ్చునని సినీ పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

బిష్నోయ్‌ల కులదైవం కృష్ణజింక

bear

1998 అక్టోబర్ 1న అప్పట్లో హీరోగా నిలదొక్కుకుంటున్న దశలో సల్మాన్ ఖాన్ హమ్‌సాథ్ సాథ్ హై సినిమా చిత్రీకరణకు జోధ్‌పూర్‌కు సమీపంలోని కంకనీ గ్రామసమీపంలో రాత్రి పూట జిప్సీ జీపులో వేటకు వెళ్లారు. అప్పుడు ఆయన వెంట ఇతర నటులు కూడా ఉన్నట్లు లాయరు తెలిపారు. ఆ రోజు రాత్రి కృష్ణజింకల గుంపుపై సల్మాన్ బృందం కాల్పులు జరిపింది. ఈ దశలో రెండు జింకలు మృతి చెందాయి. వన్యప్రాణి చట్టం పరిధిలో కృష్ణ జింకలను అరుదైన అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలో ఉంచారు. అడవులలో అర్థరాత్రి కాల్పుల చప్పుడుతో గ్రామస్థులు రావడం వేటగాళ్ల జీపును వెంబడించడం జరిగింది. డ్రైవింగ్ సీట్లో సల్మాన్ ఖాన్ ఉన్నట్లు స్థానికులు గుర్తించడం కీలకంగా మారింది. మిగిలిన వారిని స్థానికులు సరిగ్గా గమనించకపోవడంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ పరిధిలో వారు ఈ నేరం నుంచి విముక్తులు అయ్యారని లాయర్లు తెలిపారు. జోధ్‌పూర్ సమీపంలో నివసించే బిష్నోయ్ కులస్థులు కులదైవంగా పూజిస్తారు. తమ కులదైవాన్ని అందులోనూ అంతర్థానం అవుతున్న జీవాన్ని చంపివేశాడనే ఆగ్రహంతో స్థానికులు సల్మాన్ ఇతరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1998లో జరిగిన వేట ఘటనలో కీలక తీర్పు 2౦18లో వెలువడింది. తీర్పు దశలో నిందితులంతా కోర్టు హాల్‌లో ఉన్నారు.