Search
Saturday 22 September 2018
  • :
  • :

ఫైనల్లో పెనెటా

Flavia-Pennettaన్యూయార్క్ : యుఎస్ ఓపెన్‌లో ఫ్లావియా పెన్నెట్టా జోరు కొనసాగి స్తోంది. అదిరిపోయే ఆటతో వరుస విజయాలు సాధిస్తున్న 33 ఏళ్ల పెన్నె ట్టా శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో రెండోసీడ్ సిమోనా హలెప్(రొమేనియా)ను వరుస సెట్లలో చిత్తుచేసింది. భారత కాలమా నం ప్రకారం గురువారమే జరగాల్సిన ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుతగలడంతో శుక్రవారానికి వాయి దాపడింది. దక్కిన ఒక్కరోజు విశ్రాంతిని సద్వినియోగం చేసుకున్న పెన్నెట్టా తనకంటే ర్యాంకింగ్స్‌లో మెరుగైన ర్యాంక్‌లో ఉన్న హలెప్‌ను 6-1, 6-3తో 59 నిమిషాల్లోనే మట్టికరిపించింది. మ్యాచ్ ఆధ్యంతం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించిన పెన్నెట్టా తొలిసెట్ మొదటి గేమ్‌ను 40-15తో నెగ్గినా..

రెండోగేమ్‌ను 0-40తో కోల్పోయింది. అయితే వెంటనే తేరుకున్న పెన్నెట్టా మూడోగేమ్‌ను 40-0తో సొంత చేసుకొని ఆధి క్యాన్ని దక్కించుకుంది. ఇక పలుమార్లు డ్యూస్‌కు దారితీసిన నాల్గోగేమ్‌లో హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన పెన్నెట్టా ఆరోగేమ్‌లోనూ మరోసారి సర్వీస్ బ్రేక్ చేసి 28 నిమిషాల్లోనే సెట్‌ను 6-1తో సొంతం చేసుకుంది. తొలిసెట్‌లో ఒత్తిడికి గురైన హలెప్ పదపదే అనవసర తప్పిదాలు చేయడం కూడా పెన్నెట్టాకు కలిసివ చ్చింది. ఇక రెండుసెట్ ఆరంభంలో పెన్నెట్టా సర్వీస్‌ను వరుసగా రెండుసార్లు బ్రేక్ చేసిన హాలెప్ 3-1తో నిలిచినా.. ఐదోగేమ్‌లో డబుల్ ఫాల్ట్ చేసి పెనెట్టాను పుంజుకునేలా చేసింది. ఇక ఇక్కడి నుంచి హెలెప్‌ను కోర్టు నలుమూలలకు పరిగెత్తించిన పెనెట్టా ఆరు, ఏడు, ఎనిమిది గేమ్‌లను లవ్(40-0)తోనే సొం తం చేసుకుంది.

తొమ్మిదోగేమ్ మొదట్లోనూ హలెప్ ఖాతా తెరిచినా వెంటనే తేరుకున్న పెన్నెట్టా 40-15తో మ్యాచ్ పాయింట్ వద్ద నిలిచింది. అయితే మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకొని 30-40తో నిలిచిన హలెప్ తరువాత సర్వీస్‌లో మాత్రం బంతిని నెట్ కొట్టి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను పెన్నె ట్టాకు సమర్పించుకుంది. మ్యాచ్‌లో హలెప్ మూడు డబుల్ ఫాల్ట్‌లు, 23 అనవసర తప్పిదాలు చేయగా, పెన్నెట్టా ఒకే డబుల్ ఫాల్ట్ చేసింది. ఇక 23 విన్నర్స్ కొట్టిన పెన్నెట్టా ఒక ఏస్‌ను సంధించింది. ఫైనల్లో టాప్‌సీడ్ సెరెనా విలియమ్స్, రోబర్టా విన్సీ(ఇటలీ)తో తలపడనుంది.

Comments

comments