Home రాష్ట్ర వార్తలు పట్టణాలకూ విమానాలు

పట్టణాలకూ విమానాలు

రాష్ట్రంలో విమానయాన విస్తరణపై కేంద్రంతో ఒప్పందం 

KTRన్యూఢిల్లీ : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు సైతం విమానయాన సదుపాయాన్ని కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ముందడుగు వేసింది. కేంద్ర పౌర విమానయానశాఖ, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక గజపతిరాజు, రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కెటిఆర్ సమక్షంలో కేంద్ర విమానయాన సంయుక్త కార్యదర్శి ఉషాపదీ, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర ఈ మేరకు ఒప్పంద పత్రం మీద సంతకాలు పెట్టారు. సామాన్యుడికి విమాన ప్రయాణం దగ్గర చేసేందుకు కిందటి ఏడు అక్టోబరులో కేంద్రం ప్రారంభించిన విమానయాన అనుసంధాన పథకంలో రాష్ట్ర సర్కారు భాగస్వామ్యం అయింది. ఈ పథకం ద్వార భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో పాటు పలు జిల్లా కేంద్రాల్లో నివసించే ప్రజలు తక్కువ ధరకే విమాన ప్రయాణం చేసే అవకాశం లభించనుంది. ఈ అవగాహన ఒప్పంద ద్వారా ఆర్థికంగా, సాంకేతికంగా అనువుగా ఉన్న విమానాశ్రయాలను వినియోగ ంలోకి తీసుకువచ్చి ఎయిర్‌పోర్టు అథారిటీ ద్వారా విమాన సర్వీసులను పట్టణాలకు అందించేందుకు వీలు అవుతుంది. రాష్ట్రంలో కేవలం శంషా బాద్ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రం లోని ద్వితియశ్రేణి నగరాల్లో కొత్త విమానాశ్రయాలు నెలకొల్పడంతో పాటు నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంపై కేంద్ర, రాష్ట్ర సర్కార్లు దృష్టి సారించనున్నాయి. కొత్తగూడెం, వరంగల్‌తో పాటు మొత్తం తొమ్మిది విమానాశ్రయాలను వినియోగంలోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర సర్కారు భావిస్తున్నాయి. బేగంపేట విమానాశ్రయంలోని నాలుగు హేంగర్లను స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అకాడమీకి లీజుకు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. అవగాహన ఒప్పందం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ … ఆర్థికంగా సాధ్య సాధ్యాల ఆధారంగా చిన్న పట్టణాల్లో సైతం విమానాశ్రయాలు నిర్మిం చాల ని కేంద్రం భావిస్తోందని చెప్పారు. కొత్తగూడెం విమానాశ్రయం కోసం రా ష్ట్ర సర్కారు చేసిన వినతిపై స్పందించిన కేంద్రమంత్రి అశోకగజపతి రాజు రాష్ట్ర సర్కారు అడిగిన వెంటనే సాంకేతికపరమైన అనుమతులను మంజూ రు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రమంత్రి గజపతి రాజు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని అన్నారు.
పలువురు కేంద్రమంత్రులతో కెటిఆర్ భేటీ
కేటీఆర్ తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను కలుసుకొని పెండింగ్ పనులను వారి దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి అనంతగీతే కార్యాలయానికి రాష్ట్ర అటవీశాఖమంత్రి జోగురామన్న, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి వెళ్లారు. ఆదిలాబాద్‌లో మూతపడ్డ సి మెంట్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. 1998లో సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడడం వల్ల రెండు వేలమంది కార్మికులు ఉపాధి కోల్పో యారని చెప్పారు. రాష్ట్ర సర్కారు నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి అవసరం అయి న అన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రామ గుండం థర్మల్ ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెట్టిన తరహాలోనే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీలో సైతం పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని చెప్పారు. అనంతరం కేంద్ర జౌళీశాఖమంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. తెల ంగాణ వేదికగా జాతీయ జౌళి సమ్మేళనం ఏర్పాటు చేయాలని గతంలో చేసి న విజ్ఞప్తి మరోసారి గుర్తు చేశారు. వరంగల్ టెక్స్‌పార్క్ , సిరిసిల్లా మెగా ప వర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ లతో కూడా భేటీ అయ్యారు. గతంలో చేసిన ప్రతిపాదనలపై చర్చించారు.