Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో ఫ్లిప్‌కార్ట్‌దే హవా

FLIPKART

బెంగళూరు: పండుగ సీజన్‌లో ఇకామర్స్ దిగ్గజాలు భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థలు ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’, ‘గ్రేట్ ఇండియన్ సేల్’ పేరిట భారీ డిస్కౌంట్లతో దుమ్మురేపుతున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ల జోరు 25వ తేదీ వరకు కొనసాగుతుంది. స్మార్ట్‌ఫోన్ల కేటగిరీలో అమెజాన్ కంటే ఫ్లిప్‌కార్ట్‌దే పైచేయిగా ఉందని తెలుస్తోంది. మొత్తానికి రెండు దిగ్గజాలు రెండో రోజుల్లో జరిపిన విక్రయాలు గతేడాదితో పోలిస్తే రెండింతలు పైగా పెరిగాయని, ఈమేరకు ఆ సంస్థలు ప్రకటించాయి. తొలి 20 గంటల్లో 13 లక్షల స్మార్ట్‌ఫోన్లను అమ్మినట్టు, ఈ సంఖ్య గత ఏడాది కంటే రెట్టింపని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

బుధవారం బిగ్ బిలియన్ డే ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం మార్కెట్ షేరులో 65 శాతం సంపాదించినట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ విభాగంలో 75 శాతంగా ఉందని పేర్కొంది.  విక్రయాలు అద్భుతంగా ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్లు, రెడ్‌మి నోట్ 4, శాంసంగ్ ఎస్7, ఎస్8 లు ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. మరోవైపు అమెజాన్ కూడా తన స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో ఎక్కువ వృద్ధి ఉన్నట్టు తెలిపింది. గతేడాది దీపావళి కంటే 100శాతం పెంపును చూస్తున్నామని అమెజాన్ అధికార ప్రతిధి చెప్పారు. ఆన్‌లైన్ కంపెనీలు జరుపుతున్న సేల్స్‌ను పరిశీలించినన విశ్లేషకులు గురువారం నాటికి స్థూల సరుకుల విలువ(జిఎంవి) రూ.2500 కోట్లను అధిగమించినట్టు తెలిపారు. మొత్తంలో డే-1 విక్రయాల్లో రూ. 1000 కోట్ల జిఎంవిలు నమోదైనట్టు రెడ్‌షీర్ సిఇఒ అనిల్ కుమార్ తెలిపారు.

Comments

comments