Home బిజినెస్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ తిరస్కరణ

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ తిరస్కరణ

Ekart

ముంబయి: ఆన్‌లైన్ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అనేక నెలలపాటు చర్చలు జరిపి స్నాప్‌డీల్ కొనుగోలుకు 700 నుంచి 800 మిలి యన్ డాలర్ల మేరకు చేసిన ఆఫర్‌ను స్నాప్‌డీల్ కంపెనీ బోర్డ్ తిరస్కరించింది. ఒకనొక కాలంలో స్నాప్‌డీల్ విలువ 1 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఫ్లిప్‌కార్ట్ మళ్లీ ఆఫర్‌ను సవరించి కొనుగోలు చేసే అవకాశం ఉందని కూడా మార్కెట్ వర్గాలు భావి స్తున్నాయి. స్నాప్‌డీల్‌లో జపాన్ ఇంటర్నెట్ దిగ్గ జం సాఫ్ట్‌బ్యాంక్‌కు 33శాతం వాటా ఉంది.