Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

యాపిల్ వాచ్, టీవీలు, ఎసిలపై టాప్ డీల్స్

  • మే 14 నుంచి 18 వరకు ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ 10’ సేల్

Flipkart-Big-10

ముంబయి: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ 10’ సేల్ తొలి రోజు పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. యాపిల్ వాచ్, టీవీలు, ఎసిలపై టాప్ డీల్స్ ప్రకటించింది. అలాగే ఫ్యాషల్ అండ్ లైఫ్‌స్టైల్, హోమ్ అండ్ ఫర్నిచర్లపైనా భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్‌పై మే 15 నుంచి డిస్కౌంట్లు ఉంటాయి. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ 10’ సేల్ ద్వారా ఆఫర్లను అందిస్తోంది. మే 14 నుంచి 18 వరకూ విభాగాల వారీగా ఆఫర్లు ఇవ్వనుంది. తొలి రోజు ఆదివారం టెలివిజన్లు, స్మార్ట్ వాచీలపై తగ్గింపును ప్రకటించింది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూసే మొబైళ్లపై సోమవారం డిస్కౌంట్ ఇవ్వనుంది. యాపిల్ వాచ్ సిరీస్2, సిరీస్1లపై రూ.5000 వరకూ తగ్గింపు ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డు వినియోగదారులు రూ.1500 అదనంగా, ఫోన్‌పే ద్వారా పేమెంట్ చేసే వాళ్లు రూ.300 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రా కూడా ఇవే తేదీల్లో స్వతంత్రంగా సేల్స్‌ను చేపడుతోంది. పలు రకాల బ్రాండ్లపై దాదాపు 80 శాతం వరకు డీల్స్, డిస్కౌంట్లు ప్రకటిస్తోంది. పండుగ సీజన్ సేల్స్‌కు ముందే ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు ఆఫర్లను అందిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ ఈ నెల 11-14 వరకు గ్రేట్ ఇండియా సేల్ పేరిట ఆఫర్లను ఇచ్చింది. మొత్తానికి ఈ రెండు సంస్థలు పోటాపోటీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
స్నాప్‌డీల్ ఉద్యోగులకు రూ.193 కోట్ల బొనంజా
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో స్నాప్‌డీల్ కలవనున్న నేపథ్యంలో ఉద్యోగులను తొలగించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆందోళనలను స్నాప్‌డీల్ పటాపంచలు చేసింది. ఉద్యోగులకు జీతభత్యాలు పూర్తిగా చెల్లించలేక కొన్ని సంస్థలు చేతులెత్తేస్తాయి. అయితే ఇ-కామర్స్ వెబ్‌సైట్ స్నాప్‌డీల్ తన సంస్థ ఉద్యోగులకు రూ.193 కోట్ల బొనాంజా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. స్నాప్‌డీల్- ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు ఒప్పందం పూర్తయితే స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు సుమారు 30మిలియన్ డాలర్లను ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ఇవ్వనున్నారని వ్యాపార వర్గాల సమాచారం. స్నాప్‌డీల్‌లో మొత్తం 1,500-2000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. స్నాప్‌డీల్ బృందానికి సుమారు 30 మిలియన్ డాలర్లు(రూ.193 కోట్లు) చెల్లించాలని వ్యవస్థాపకులు బోర్డును కోరారు. గత 12 నెలల్లో కంపెనీ నుంచి వెళ్లిపోయిన కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకూ ఈ ఫలాలను అందించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వ్యయం తగ్గింపు పేరిట ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగిస్తూ.. రెండు మూడు నెలల వేతనం చెల్లిస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. కానీ స్నాప్‌డీల్ మాత్రం ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది.

Comments

comments